పూలసొయగాలతొ లాల్ భాగ్

  • లాల్ భాగ్ లో ఆరంభం అయిన ఫలపుష్ప ప్రదర్శన
  • ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెంగళూర్ ప్యాలస్
  • ప్రధాన ఆకర్షణగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైకత శిల్పం

బెంగళూర్ లోని  చారిత్రక లాల్ భాగ్ బొటానికల్ఉద్యానవనం పూలసొయగాలతొ అద్బుత దృశ్యాలతోసందర్శకులను ఆకట్టుకుంది. స్వతంత్ర దినం వేడుకల సందర్భంగాఇక్కడ ఏర్పాటు చేసిన పూల బెంగళూర్ ప్యాలస్ నమూనా ప్రత్యేకఆకర్షణగా నిలుస్తుంది. దాదాపు మూడు లక్షల గులాబీలతోరూపుదిద్దుకున్న ఈ ప్యాలస్ నమూనా వీక్షకులనుమంత్రముగ్ధులను చేస్తుంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంసైకత  శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

lal3ప్రజలలో మిశ్రమస్పందన: బెంగళూర్ లోని లాల్ భాగ్ బొటానికల్ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్యాలస్ నమూనా పై ప్రజలలోమిశ్రమ స్పందన కనిపిస్తుంది  ఇదివరకు గ్లాస్ హౌస్ మాత్రమెకాకుండా లాల్ భాగ్ ఉద్యానవన ప్రాంతం చుట్టూ పూలతోఅలంకరించేవారు, కాని ఈ సంవత్సరం ఎక్కువ శాతం పూలు గ్లాస్హౌస్కు వాడారని కొంతమంది వీక్షకులు వాపోయారు. బెంగళూర్ప్యాలెస్ చరిత్ర దాదాపు ఇప్పటి తరానికి తెలియదని అలాంటివారికి బెంగళూర్ ప్యాలస్ గురించి తెలుసుకోవడానికి ఇది చక్కటిఅవకాశం మరికొంతమంది తెలిపారు. భారత దేశం చాలా బాగుంది,లాల్ భాగ్‌లో ఏర్పాటు చేసిన ప్యాలస్ నమూనా చాలా బాగాఆకట్టుకుందని విదేశి పర్యాటకులు తెలిపారు. బెంగుళూరులోఉద్యోగం చేసే వారి సంఖ్య ఎక్కువ కాబట్టి వారం రోజులు మాత్రమెప్రదర్శన సరిపోదని, ఇంకా ఎక్కువ రోజులు ఉంటేనే బాగుంటుందనిసరితా అనే గృహిణి తెలిపారు.

పెరిగిన సెక్యూరిటీ: గతంలో కంటే ఇప్పుడుసెక్యూరిటీలో చాలా మార్పులు వచ్చాయని సరిత తెలిపారు.సెక్యూరిటీ పరంగా చాల డెవలప్మెంట్ ఉందని, ఉద్యానవనం చుట్టూమరియు గ్లాస్ హౌస్‌లో కూడా సి.సి కెమెరాలు ఏర్పాటు చేసిభద్రతను కట్టుదిట్టం చేసామని, ఒక మోనిటరింగ్ టీం ఎప్పుడూఏర్పాట్లను పర్యవేక్షిస్తూ  ఉంటుందని పోలీస్ ఇంచార్జీ ఒకరుతెలిపారు. ప్రొద్దున్న తోమ్మిది గంటలకు మొదలయి సాయంత్రంఆరు గంటలకు ముగుస్తుందని ఇలా పది రోజులు కొనసాగుతోందిఅని ఆయన తెలిపారు. ఐదు రోజులకు ఒకసారి పూలనుమారుస్తామని, పూలను మార్చడానికి ఎనిమిది గంటలు పడుతుందికాబట్టి రాత్రి సమయంలో మాత్రమె పూలను మారుస్తామని ఐదుసంవత్సరాలుగా లాల్ భాగ్‌లో విదులు నిర్వహిస్తున్నఇంచార్జీపోలీస్ తెలిపారు.

lal2వివిధఆకర్షణలు: లాల్ భాగ్‌లో ఏర్పాటు చేసినబెంగళూర్ ప్యాలస్ మాత్రమె కాకుండా వివిధ ఏర్పాట్లు కుడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఫోటో గ్యాలరీ,అబ్దుల్ కలాం సైకత శిల్పం,ఎం.హెచ్.ఎస్,బోన్సాయ్ పార్కు వంటివి వీటిలో ఉన్నాయి.మైసూర్ కు చెందిన గౌరీ రూపోందించిన దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైకత  శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలాం సైకత శిల్పం రూపొందించడానికి తనకు రెండు రోజుల సమయం పట్టిందని. భారత దేశం గర్వించదగ్గ మాజీ రాష్ట్రపతి కలాం నివాళి తన సైకత శిల్పం ద్వారా తెలపాలని అనుకున్నానని గౌరీ చెప్పారు.

పూలఅంతఃపురం: లాల్ భాగ్‌లో  ఏర్పటు చేసిన బెంగళూర్ ప్యాలస్ నమూనా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. సుమారు రెండు లక్షల డచ్ రోజా పూలను అంతఃపుర నిర్మాణానికి వాడారు. బెంగళూర్ ప్యాలస్ నమూనా ఎదురుగా రాజ వంశానికి చెందిన రాజుల విగ్రహాలు, భియ్యంతో తయారు చేసిన జాతీయ పతాకం,రాణి పల్లకీ,ప్యాలస్ నమునా చుట్టూ సైనికుల విగ్రహాలు అలనాటి ప్యాలస్ రాజదర్పాన్ని వివరిస్తుంది.

సుమారు 250 మంది రాష్ట్రానికి సంబంధించిన రైతులు వారు పండించే అరుదైన పంటల గురించి వివరిస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ ఫలిపుష్ప ప్రదర్శన కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.

Suphani Kanth

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s