పెరుగుతున్న ఈ-పుస్తకాల విక్రయాలు

  • ఈ-కామర్స్ లో తక్కువ ధరకు లభించడమే ప్రధాన కారణం.                        
  • హోండెలివరీ కూడా మరొక కారణం.
  •  మానవ జీవితంలో నేడు ఇంటర్నెట్ ఒక బాగమైంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు ఆన్ లైన్ వ్యాపారo మొదలుపెట్టాయి. ఆన్ లైన్ వ్యాపారాలు పుస్తక విక్రయాలలో కూడా కొన్ని మార్పులకు కారణమవుతున్నాయి.

ఆన్ లైన్ పోటీ తట్టుకుంటున్న పుస్తక దుకాణాలు: ఆన్ లైన్ పుస్తక విక్ర్రయాలు పెరుగుతున్న కూడా పుస్తక దుకాణాలు పొటీ తట్టుకుని నిలబడుతున్నాయని, మార్కెట్ లో పుస్తక దుకాణాలకు ఉన్న గుడ్ విల్ మరియు పుస్తకాల అమ్మకాలలో ప్రాధానంగా అమ్ముడుపోయే యూనివర్సిటీ టెక్స్ట్ బుక్స్,స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఆకాడమి బుక్స్ పుస్తక దుకాణాలలో  మాత్రమే లభ్యమవుతుండడం కుడా ఒక కారణం అని బాగ్లూర్ కు చెందిన తన్వీర్ అనే బుక్ షాప్ ఓనర్ తెలిపారు.

పుస్తకాలు చూసి కొనుగోలు చేసే అవకాశం: బుక్స్ స్టోర్స్ లో అయితే కొనుగోలు చేసే పుస్తకాలు చూసి విషయాన్ని గ్రహించి అవసరం ఉంటేనే కొనుగోలు చేయవచ్చు లేదా మరొక దాని గురించి చూసే అవకాశం ఉంటుంది, అదే ఆన్ లైన్ కొనుగోలు చేసే వాటిలో ఈ అవకాశం ఉండదు కేవలం ఇండెక్స్ మాత్రమె చూసి కొనవలసి వస్తుందని ఐ.ఐ.టి లో ఎం.టెక్ ఏరోనాటికల్ చదువుతున్న గోపి కృష్ణ అనే విద్యార్థి వాపోయారు.

ఆన్ లైన్లో మాత్రమే లభ్యమవుతున్నకొన్ని పుస్తకాలు: బుక్స్ స్టోర్స్ లో ఫార్మాసూటికల్ కి సంబంధించిన మొత్తం అన్ని పుస్తకాలు దొరకడం లేదని కొన్ని ఈ- కామర్స్ సైట్లలో మాత్రమె దొరుకుతున్నాయని, దీనివల్ల ఆన్ లైనులో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నానని  సతీష్ అనే ఫార్మాసూటికల్ ఉద్యోగి చెప్పారు, ఇదే విషయాన్ని తన్వీర్ అనే బుక్ షాప్ యజమానిని అడగగా “మేము కూడా మాకు దొరకని పుస్తకాలని ఆన్ లైనులో కొనుగోలు చేస్తున్నాము దీని వల్ల కష్టమర్లు దూరం కాకుండా చుసుకుంటున్నాము” అని చెప్పారు.

తక్కువ ధర మరియు ఉచిత హోం డెలివరీ: ఆన్ లైనులో  కొనుగోలు చేసే పుస్తకాలను తక్కువ ధరకు విక్రయించడంతో తాము పుస్తకాలని ఆన్ లైనులో కొనుగోలు చేస్తున్నాము అని, దీనికి తోడు కొన్నిచోట్లకు ఉచిత హోం డెలివరీ సదుపాయం కూడ ఉండడంతో తమలాంటి ఉద్యోగులకు బుక్ షాప్ వెళ్ళే శ్రమ తగ్గుతుందని విజయ్ అనే బిశ్లరి వాటర్ కంపెనీ లో పనిచేసే ఉద్యోగి తెలిపారు. ఈ విషయాన్ని ఈ మధ్యే గ్రహించిన కొన్నిబుక్స్ స్టోర్ యజమానులు వారు కూడా ఈ ప్రక్రియను మొదలుపెట్టారని ఆయన తెలిపారు.

జోరందుకున్న సెకండ్ హ్యాండ్ పుస్తకాల సేల్స్: ఎక్కువ ధరలున్న కొత్త పుస్తకాలను కొనలేకపోతున్న తాము సెకండ్ హ్యాండ్ పుస్తకాలపై మక్కువ చూపుతున్నామని ఎం.జి రోడ్ లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొంటున్న కొందరు విధ్యార్థులు తెలిపారు. విద్యార్థులు కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాలపై ఎక్కువగా అడగడం వల్ల మేము కూడా ఎక్కువ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడం అమ్మడం చేస్తున్నామని అక్కడి వ్యాపారులు తెలిపారు.

– Suphani Kanth

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s