కర్ణాటక ఎన్నికల సర్వే

మనోహిత్ పడకంటి
NSoJ బ్యూరో
కర్ణాటక లో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం .రానున్న 2018 ఎన్నికలలో  ఈ ప్రభుత్వమే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక ప్రజలు వేరే మార్పు ఏదైనా కోరుకుంటున్నారా అన్న విషయం పైన  మా బృందం ఒక సర్వే నిర్వహించింది . ఈ ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం  ప్రభుత్వం యొక్క పని తీరు . లోపాలు మరియు ప్రజల యొక్క సలహాలు అడిగి తెలుసుకున్నాం .

ఈ విషయం పైన ఉద్యోగులను , విద్యార్థులను , పువ్వుల దుకాణాలు, పండ్ల దుకాణాల వర్తకులను మరియు గృహిణులను అడగగా, వారు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి .
ట్రాఫిక్ అధికంగా ఉందని, అధిక ట్రాఫిక్ వలన వాతావరణ  కాలుష్యం పెరుగుతుంది అన్నారు. ట్రాఫిక్ సమస్య ఎందుకు పెరుగుతుంది అని కారణాలు అడగగా రోడ్లు మంచిగా లేవని ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ప్రయాణించాలంటే చాల కష్టంగా ఉందన్నారు.
మెట్రో లో ప్రయాణం సులభం గా ఉంటుంది కానీ మెట్రో రైలు అన్ని ప్రాంతాలకు లేదని వాపోయారు. రోడ్ల విస్తరణ మరియు మరమ్మతులు చెయ్యాలని ప్రభుత్వాన్ని సూచించారు.
బెంగళూరు అనేది గ్రీన్ సిటీ కానీ ఆ పచ్చదనం కనిపించట్లేదు అన్నది ఒక ఉద్యోగిని అభిప్రాయం.

ఈ ప్రభుత్వ  కాలం లో అవినీతి ఎక్కువగా ఉందని అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఒక కోరమంగళ నివాసి చెప్పిన ప్రకారం వారి ఇంటి సమీపాన పబ్ లు రాత్రి పూత పార్టీ లు అధికంగా జరుగుతున్నాయని ఈ విషయమై పోలీసులకు మరియు ఆ ప్రాంతం యొక్క కార్పొరేటర్ కు చెప్పిన పట్టించుకోవడం లేదని చెప్పారు. నివాస ప్రాంతం లో ఇలాంటివాటికి అనుమతి ఇవ్వొద్దని అన్నారు. రాత్రి 2 గంటల సమయం వరకు అధిక శబ్దం తో పాటలు పెట్టడం వలన నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితి ఉందన్నారు.

మద్యం దుకాణాలు నిషేధించాలని ఒక గృహిణి ప్రభుత్వాన్ని కోరింది. మద్యం దుకాణాలను నిషేధిస్తామని ప్రభుత్వం చెప్పడమే కానీ చెయ్యట్లేదు అని ఆమె అన్నారు. అడుగడుగునా మద్యం దుకాణాల ఉండడం వలన మద్యం సేవించేవారు మద్యానికి బానిసలుగా మారుతున్నారు,ఎంతో మంది కాపురాలు కూడా పాడు కావడానికి మద్యం కారణం అన్నారు. ప్రభుత్వమే కాకుండా పౌరులు కూడా బాధ్యతతో ఉండాలని కోరారు.
ప్రభుత్వం పనితీరు లో లోపాలు ఉన్నాయని పూలు, పండ్ల వర్తకులు మరియు చిల్లర వర్తకులు అన్నారు. ప్రభుత్వం చెప్పిన హామీలు అందరికీ అందడం లేదని పేదలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం మీద నమ్మకం ఎలా ఉంటుంది అన్నారు. ఓట్లు కోసం అడగనిప్పుడు కనిపించేవారు ఎన్నికల తర్వాత కనిపించరు. వారి గోడు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా ఎలాంటి ప్రయోజనాలు లేవంటున్నారు.

బెంగళూరు లో ఐటి సంస్థలు అధికంగా ఉన్నాయని ఒకవేళ ఐటి పడిపోయే పరిస్థితి వస్తే యువతకు చాల నష్టం జరుగుతుందని, ఉద్యోగాల విషయం లో ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు. ఐటి ఒక బెంగళూరు లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఉంటే జనాభా తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుందని సూచించారు.వచ్చే ఎన్నికలలో సమస్యలను తీర్చే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పారు.

ఏ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ప్రజలు దేనికి ఓటు వేస్తారో చూడాలంటే 2018 లో జరిగే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే, ఎందుకంటే ఓటు వేసి ప్రజాప్రతినిథి ని ఎన్నుకోవడం ప్రజల హక్కు కాబట్టి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s